స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున వాదనలు వినిపించేందుకు వచ్చిన సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా, చంద్రబాబుకు ప్రాణ హాని ఉందంటూ సంచలనానికి తెరదీశారు. అసలు చంద్రబాబును జైల్లో ఉంచడం సరికాదన్నారు. నేడు సిద్దార్థ్ లూథ్రా మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో భాగంగా పై వ్యాఖ్యలు చేశారు. నేడు చంద్రబాబు హౌస్ అరెస్ట్ పిటిషన్ పై తమ వాదనలు వినిపిస్తామన్నారు. గతంలో వెస్ట్ బెంగాల్‌కు చెందిన మంత్రుల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావిస్తామని వెల్లడించారు. ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నామని సిద్దార్థ్ లూద్రా తెలిపారు.