ఉమ్మడి అనంతపురం జిల్లా, ధర్మవరంలో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ను హౌస్ అరెస్టు చేసేందుకు పోలీసులు వచ్చారు. అయితే వారి కళ్లు కప్పి గోడ దూకి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు పరిటాల శ్రీరామ్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే గాంధీనగర్ సర్కిల్‌కు భారీగా టీడీపీ నాయకులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు.. టీడీపీ నాయకులకు మధ్య తీవ్ర తోపులాటలు జరిగాయి. పలువురు కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టీడీపీ నాయకుల్ని ధర్మవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa