టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫోన్లో పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ని తీవ్రంగా ఖండించారు. టీడీపీ ఇవాళ చేపట్టిన బంద్‌కు తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు తెలిపామని పేర్కొన్నారు. నియంత పాలనపై అందరూ కలిసి పోరాడదామని పిలుపునిచ్చారు. కాగా బంద్‌కి మద్దతు ఇచ్చినందుకు నారాయణకు లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.