స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఇవాళ మరోసారి విజయవాడలోని ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబుకు బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్ వేయనున్నారు. ఆయన దాఖలు చేసే పిటిషన్పై కాసేపట్లో విచారణ జరిగే అవకాశముంది. కాగా చంద్రబాబును 5 రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ పిటిషన్ వేసింది. దీనిపై చంద్రబాబు తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయనున్నారు.