75 ఏళ్ల వ్యక్తి, 35 ఏళ్ల మహిళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ జిల్లా అప్పేగౌడనహళ్లికి చెందిన ఈరన్న అనే మోతుబరి రైతు భార్య గతంలోనే మరణించింది. ఈ క్రమంలో ఈరన్న.. భర్త నుంచి విడిపోయి.. పిల్లలతో పాటు వేరుగా జీవిస్తోన్న అనుశ్రీ అనే మహిళతో పెళ్లి ప్రస్తావన తేగా అంగీకరించింది. దీంతో వారు వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.