టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు దారుణమని ఆ పార్టీ నేత కేశినేని చిన్ని వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియా మాట్లాడుతూ.. ఎటువంటి ఆధారాలు లేకపోయినా దొంగ సెక్షన్లు పెట్టారన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక హీనంగా వ్యవహరించారని మండిపడ్డారు. వైసీపీ అవినీతిని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు కడిగిన ముత్యం లాగా బయటకి వస్తారన్నారు. జగన్ సైకో ప్రభుత్వం పోతేనే ... ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికలలో జగన్కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు.