చంద్రబాబు అరెస్టుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్సందించాలి అని మాజీ ఎంపీ రేణుకా చౌదరి డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... చంద్రబాబుకు కేంద్రం జాతీయ స్థాయిలో పటిష్టమైన భద్రత కల్పించాలి. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. జగనొక మెంటల్. జగన్‌కు నా సొంత ఖర్చుతో మానసిక చికిత్స చేయిస్తా. రాజ్యాంగంలో మార్పులు తేవాలి. ప్రతి ఐదేళ్లకు ఒకసారి నాయకులంతా తాము మానసికంగా ఫిట్‌గా ఉన్నామని నిరూపించుకోవాలని చట్టం చేయాలి. జగన్ మానసిక స్థితి సరిగా లేదు... ఏమైనా చేస్తాడు. బంగారం లాంటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు’’ అని పేర్కొన్నారు.