బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు మరింత బలపడనుంది. దీనికి తోడు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వీటి ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తరకోస్తాలోని ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని చెప్పింది. భారీగా ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.