దేశంలోనే తొలిసారిగా చికెన్ పాక్స్ కొత్త వేరియంట్ ' క్లాడ్ 9'ను గుర్తించినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) సైంటిస్టులు వెల్లడించారు. మంకీపాక్స్ అనుమానిత కేసులను పరిశీలించే క్రమంలో పలువురిలో 'క్లాడ్ 9' వేరియంట్ ను గుర్తించినట్లు తెలిపారు. యూకే, జర్మనీ, యూఎస్ లో ఈ వేరియంట్ అధికంగా కనిపిస్తుందన్నారు. 'క్లాడ్ 9' సోకిన 2 వారాల తర్వాత దద్దుర్లు, తలనొప్పి, ఆకలి తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.