టీడీపీ అధినేత చంద్రబాబు గోబెల్స్‌ను నమ్ముకొని నేటికి ముందుకు వెళ్తున్నారని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. సజ్జల మాట్లాడుతూ..గత నాలుగు రోజులుగా చంద్రబాబు అరెస్టుకు సంబంధించి, కోర్టు సాక్షాధారాలు ఉన్నాయని భావించి జుడీషియల్ కస్టడీకి పంపింది. అయితే ఇంత జరిగినా టీడీపీ పార్టీ, కొన్ని మీడియా సంస్థలు, చంద్రబాబు పెంచి పోషించిన కొందరు వ్యక్తులు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. 73ఏళ్ల వృద్ధుడిని హింసిస్తున్నట్టు చూపించే ప్రయత్నం దారుణం అని అన్నారు.