విశాఖపట్నం జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకి నిరసనగా టీడీపీ శ్రేణులు బుధవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ నిరసనలో పలువురు నాయకులు, కార్యకర్తలు నల్ల దుస్తులు, బ్యాడ్జీలు ధరించి దీక్షలో పాల్గొన్నారు. అనకాపల్లి, ఎలమంచిలి, పాయకరావుపేట, పరవాడ మండలం వాడచీపురుపల్లి, నాతవరం, రోలుగుంట, మాడుగుల ప్రాంతాలలో నిరసన దీక్షలు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa