సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని లేపాయి. దీనిపై తాజాగా సీఎం ఎంకే స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మంపై చర్చకు దూరంగా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకుని ప్రధాని రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న ట్రాప్లో మనం పడిపోకూడదు అని స్టాలిన్ వివరించారు.