‘సనాతన ధర్మం’ వివాదంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియా’ కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటోందని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్లోని బినాలో ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించి మాట్లాడారు. డీఎంకే నేత, తమిళనాడు రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న క్రమంలో మోదీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.