టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకి నిరసనగా గుడివాడ టీడీపీ నేత వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో చేస్తున్న నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబును జైల్లోనే ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు. నిజమైన ధైర్యవంతుడిగా చంద్రబాబు నిలిచారని ... తన నిజాయితీని నిరూపించుకుంటారని అన్నారు. న్యాయ వ్యవస్థ వాస్తవాలను గుర్తించాలన్నారు. తామంతా చంద్రబాబు వెంట ఉంటామనే సందేశాన్ని తెలుగు ప్రజలు బలంగా వినిపించారన్నారు.