కేరళలో నిఫా వైరస్ కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కోజికోడ్ జిల్లాకు చెందిన మరో వ్యక్తికి వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో తాజా కేసుతో కలపి మెుత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అదే విధంగా ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయన్నారు.