చిన్న గొడవ కారణంగా 15 కత్తిపోట్లు పొడిచి ఓ వ్యక్తిని హత్య చేసిన దారుణ ఘటన ఢిల్లీలో జరిగింది. శుక్రవారం అర్వింద్ మండల్ అనే వ్యక్తి తన కుమారుడిని దుర్బాషలాడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో నిందితుడు తన స్నేహితులతో కలిసి.. అర్వింద్‌ను విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. అర్వింద్ భార్య రేఖా మండల్‌పై కూడా దాడి చేయగా.. ఆమెను ఆస్పత్రికి తరలించారు.