కేరళలో విజృంభిస్తున్న నిపా వైరస్‌లో బంగ్లాదేశ్ స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమని ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్’కు చెందిన మాజీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రమణ్ గంగాఖేద్కర్ చెప్పారు. బంగ్లాదేశ్ స్ట్రెయిన్ సోకిన ప్రతి 10 మందిలో 9 మంది మరణించే అవకాశం ఉందన్నారు. ఈ స్ట్రెయిన్ ఊపిరితిత్తులపై తీవ్రంగా పనిచేసి ఊపిరాడకుండా చేస్తుందని చెప్పారు. దీంతో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందన్నారు.