వివేక్ రామస్వామి సంచలన ప్రకటనల చేస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే తమ పార్టీ అధికారంలోకి వస్తే 75 శాతం కేంద్ర ఉద్యోగుల తొలగింపుతో పాటు ఎఫ్ బీఐని మూసివేస్తామని ప్రకటించారు. తాజాగా లాటరీ ఆధారిత హెచ్-1బీ వీసా ప్రక్రియకు స్వస్థి చెప్పుతామన్నాడు. దీని స్థానంలో ప్రతిభ ఆధారిత విధానాన్ని తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. దీంతో దేశానికి నైపుణ్యం కల వలసదారులు రావడానికి మార్గం సుగమం అవుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa