జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారతీయలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. తొమ్మిది రోజుల పాటు దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాల్లో మతాలతో సంభందం లేకుండా ఇతర మతస్తులు కూడా పాల్గొనడం ఆనందదాయకం అని అన్నారు. చాంద్రమాన పంచాంగం ప్రకారం హిందువులకు తొలి పండుగైన ఈ వినాయక చవితి... మన తెలుగు రాష్ట్రాలలో అభివృద్ధికి, ప్రజలకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా శుభాలు కలుగచేయాలని, కార్మికులు, కర్షకులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు ఆర్ధికంగా సుఖశాంతులతో విరాజిల్లాలని కోరుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa