ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేపలను తిని.. కాళ్లు చేతులు పోగొట్టుకున్న మహిళ

national |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2023, 08:24 PM

అమెరికాలోని కాలిఫోర్నియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. చేపలను తిన్న ఓ మహిళ తన రెండు కాళ్లు, రెండు చేతులను కోల్పోయింది. లారా బరాజాస్ అనే 40 ఏళ్ల మహిళ ఇటీవల తిలాపియా అనే చేపను తిని అనారోగ్యానికి గురైంది. చేపలు సరిగా ఉండకపోవడంతో.. అందులోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా కారణంగా లారా.. నెల రోజులకుపైగా హాస్పిటల్‌లో గడపాల్సి వచ్చింది. ఆమె కాళ్లు, చేతులకు ఇన్ఫెక్షన్ సోకడంతో.. సర్జరీ చేసి తొలగించారు.


సాన్ జోన్స్‌లోని లోకల్ మార్కెట్లో చేపను కొనుగోలు చేసిన లారా.. దాన్ని వండుకొని తిన్న తర్వాత అనారోగ్యానికి గురైందని ఆమె స్నేహితురాలు మెసినా తెలిపారు. ఆమె దాదాపుగా చావు అంచుల దాకా వెళ్లొచ్చిందని.. రెస్పిరేటర్ మీద ఉంచాల్సి వచ్చిందని మెసినా చెప్పారు. లారా వేళ్లు, కాళ్లు నలుపు రంగులోకి మారాయి. కింది పెదవి సైతం నల్లగా మారింది. ఆమె కిడ్నీలు కూడా ఫెయిలవడం మొదలైంది. లారా విబ్రియో వుల్నీఫికస్ అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా బారిన పడినట్టు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా సముద్ర జీవుల మాంసం, సముద్ర జలాల్లో ఉంటుంది.


ఇలాంటి ప్రమాదకర బ్యాక్టీరియాలతో ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. దీంతో సీఫుడ్‌ను వండేటప్పుడు బాగా ఉడికించాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాక్టీరియాతో కలుషితమైన సీఫుడ్ తినడం.. ఈ బ్యాక్టీరియా ఉండే నీళ్లు గాయాలకు తగిలినప్పుడు కూడా అది మన శరీరరంలోకి ప్రవేశిస్తుందని యూసీఎస్ఎఫ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ నటాషా స్పాటిస్‌వుడ్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com