ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది. తరుపరి విచారణను 21న చేపడతామని తెలిపింది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు. ఆయన తరుపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. చంద్రబాబు అరెస్ట్ చట్ట విరుద్దమని ఆయన పేర్కొన్నారు. వరుసగా ఆయనపై కేసులు నమోదు చేయడం కక్షసాధింపు చర్యలని ఆయన వాదించారు.