వినాయకచవితి సందర్భంగా వివిధ రూపాలలో తయారు చేసిన గణపతి విగ్రహాలు మార్కెట్లో అలరిస్తున్నాయి. ఐతే ట్రెండ్ కి తగట్టుగా విగ్రహాలు తయారుచెయ్యడం కూడా విశేషంగా నిలుస్తుంది. ప్రస్తుతం చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ఈ రకమైన విగ్రహాలు కూడా భక్తులని అలరిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్ళితే.... విజయవాడ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో ఉన్న వస్త్రలత కాంప్లెక్స్, పాత శివాలయం దగ్గర్లోని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చంద్రయాన్-3 విగ్రహాలు మండపంలో సృతజనాత్మకతతో ఏర్పాటు చేశారు. రాకెట్ నింగిలోకి ఎగిరిన అనంతరం జాబిల్లిపై బొజ్జగణపయ్య దర్శనమిస్తారు. అనంతరం చంద్రుడిపై ఉన్న వినాయకుడి చుట్టూ విక్రమ్ ల్యాండర్ చక్కర్లు కొట్టేలా టెక్నాలజీని వినియోగించారు. ఈ విగ్రహాలకు సంబంధించి వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఒడిశా, కలకత్తాలోని పలు మండపాల్లో కూడా ఇలాంటి విగ్రహాలనే నిర్వహకులు ఏర్పాటు చేశారు.