నంద్యాలజిల్లా, మహానంది క్షేత్ర శివారులో రోడ్లపై వెళ్తున్న ప్రజలను ఎలుగుబంటి సంచారం భయభ్రాంతులకు గురి చేసింది. స్థానికులు రాళ్లు విసరడంతో ఎలుగు బంటి అటవీలోకి వెళ్లింది. అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ఎలుగుబంటిని త్వరగా పట్టుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. కాగా.. గత 13 రోజుల క్రితం మహానంది క్షేత్ర పరిధిలో ఎలుగు బంటిని అధికారులు బంధించి అడవిలో వదిలారు. గతంలో కూడా వారం రోజుల పాటు మహానంది ప్రజలకు ఎలుగుబంటి నిద్రలేకుండా చేసింది. ఎలుగుబంటి నుంచి ఎలాంటి ప్రమాదం, ప్రాణహాని జరగకుండా ఫారెస్ట్ అధికారులు రక్షణ కల్పించాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు.