టీడీపీ యువనేత నారా లోకేశ్, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మంగళవారం ఉదయం ఢిల్లీ రాజ్‌ఘాట్ లోని గాంధీ సమాధి వద్ద లోకేష్, ఎంపీలు, మాజీ ఎంపీలు అంజలి ఘటించి నల్ల రీబెన్‌లతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ మాట్లాడుతూ..... న్యాయస్థానంలో ఈ రోజు తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయం ధర్మంపై నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa