చట్టసభల్లో మహిళలకి తగిన రిజర్వేషన్ కల్పించాలని, ఇందుకు అవసరమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, హర్షణీయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ బిల్లు కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందేలా కృషి చేసిన మోదీకి అభినందనలు తెలిపారు. చట్ట సభల్లో 33 శాతం స్థానాలు మహిళలకు దక్కేలా చేసే ఈ బిల్లు కార్యరూపం దాల్చేలా చేయడంలో ప్రధాని మోదీ ఎంతో చిత్తశుద్ధి చూపారని పవన్ కొనియాడారు. ఈ బిల్లు చట్టసభల్లోనూ ఆమోదం పొందితే కచ్చితంగా రాజకీయంగా మహిళా సాధికారత సాధ్యమవుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa