ప్రకాశం జిల్లా, సింగరాయకొండలోని బికారి వీధిలో షానూ అనే బాలికను మహేష్, సదానందం అనే ఇద్దరు యువకులు అల్లరి పెట్టారు. విషయం తెలిసిన బాలిక తండ్రి సుభానీ... ఇద్దరు యువకులను ప్రశ్నించాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు.. సుభానీపై కత్తితో దాడి చేసి పరారయ్యారు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం కందుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.