వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు. జగన్ మాట్లాడుతూ..... రాయలసీమ నీటి కష్టాలు తెలిసి శాశ్విత పరిష్కారానికి అడుగులు వేశాం. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో హంద్రీనీవా నుంచి మెట్ట ప్రాంతానికి లక్కసాగరం దగ్గర ఎత్తిపోతలతో నింపుతాం. 90 రోజుల్లో 1.74 టీఎంసీలు నింపుతాం. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక అత్యంత కరవు ఉన్న 10 వేల ఎకరాలకు సాగునీరు, తాగునీరు ఇస్తున్నాం. రూ.253 కోట్లతో పనులు చేపట్టాం. డోన్, పత్తికొండ నియోజకవర్గాలతో పాటు ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు కూడా మేలు జరుగుతుంది. వెలిగొండ ప్రాజెక్టు వచ్చే నెలలో జాతికి అంకితం చేస్తాం. ఎన్నికలకు వెళ్లేముందు మేలు జరిగిందా?, లేదా? అని మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి అని తెలియజేసారు.