తెనాలి చెంచుపేటలోని బార్ అండ్ రెస్టారెంటులో వ్యక్తిపై ముగ్గురు యువకులు బీరు సీసాలతో దాడి చేసి గాయపరిచారు. అమర్తలూరు మండలం కోరుతాడిపర్రుకు చెందిన గండికోట సాంబశివరావు తన సోదరుడితో కలసి మద్యం తాగుతున్నాడు. ఆ సమయంలో పాండురంగ పేటకు చెందిన శ్రీకాంత్, అతని మిత్రులు వచ్చి పాతకక్షల నేపథ్యంలో సాంబశివరావుపై బీరు సీసాలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa