మంగళగిరి మార్కండేయ కాలనీకి చెందిన దివి నాగరాజు గోల్డ్ షాపులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ఈనెల 13 న ఆన్లైన్ లో అమ్మకాలు- కొనుగోలు చేయడం ద్వారా అధిక లాభం గడించవచ్చునని సైబర్ నేరగాడు నాగరాజు సెల్ ఫోన్ కు మెసేజ్ పంపాడు. లింకు క్లిక్ చేసిన నాగరాజు ఆన్ లైన్ లో తొమ్మిది విడతలుగా రూ. 1, 67, 510లను చెల్లించారు. తాను చెల్లించిన నగదును తిరిగి ఇవ్వాలని కోరగా ఇవ్వకపోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశా రు.