రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతు అవుతాయని మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని రుద్రవరం మండలం, పేరూరు గ్రామానికి చెందిన 10 కుటుంబాలు అఖిలప్రియ సమక్షంలో చేరాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ .... చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయకున్నా ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ఎంతో మందికి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఉద్యోగాలు పొందిన వారంతా ఆయన అరెస్టుకు నిరసనగా బెంగళూరు, చెన్నై, హైదరాబాదులో కూడా మద్దతు తెలుపుతుంటే, రాష్ట్రంలోని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్వీట్లు పంచుకోవడం ఎంతవరకు సబబని అన్నారు.