అల్లూరి సీతారామరాజు జిల్లా, పెదబయలు మండలం లక్ష్మీపేట పంచాయతీ మొండికోట గ్రామంలో జియో టవర్ నిర్మాణానికి స్థానిక గిరిజనుడైన విజయకుమార్‌కు చెందిన వ్యవసాయ భూమిని లీజుకు ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులు అడిగారు ఇందుకు అతను నిరాకరించడంతో పెదబయలు ఎస్ఐ మనోజ్‌కుమార్, ఇద్దరు కానిస్టేబుళ్లు, జియో కాంట్రాక్టర్ కలిసి ఈ నెల 14న మొండికోట వెళ్లి విజయకుమార్‌ను దుర్భాషలాడి, అతనిపై దాడికి పాల్పడ్డారు. దీనిపై బాధితుడు విజయకుమార్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు మత్సరాస విశ్వేశ్వరరాజు ద్వారా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టి, బాధ్యులైన ఎస్ఐ, కానిస్టేబుళ్లు, జియో టవర్ కాంట్రాక్టర్‌పై రెండు వారాల్లో చర్యలు చేపట్టాలని ఎస్టీ కమిషన్ కార్యదర్శి పి.పద్మ జిల్లా ఎస్పీని ఆదేశించారు.