ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో సీఎం జగన్ జగనన్న ఆరోగ్యసురక్ష ఏర్పాటు చేసినట్లు డీఎంహెచో అమర్తలూరు శ్రావణ్ బాబు అన్నారు. మంగళగిరి గణపతి నగర్ యూపీహెచ్సిలో మంగళవారం జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా హెల్త్ సెంటర్లో హెల్త్ సెంటర్స్ సిబ్బందితో సమావేశం నిర్వహించి సర్వేని క్వాలిటీగా చేయాలన్నారు. ప్రతి కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఉన్నవారిని వెలికి తీసి, వారికి వైద్యం అందించాలన్నారు.