కైకలూరు నియోజకవర్గం లోని ఏపి వైఎస్సార్ క్రాంతి పధకం యానిమేటర్స్ (వి ఓ ఏ) లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్యే డిఎన్నార్ కి వినతి పత్రం అందించారు. బుధవారం సంఘ సభ్యులు ఎమ్మెల్యే ను అయన స్వగృహము లో మర్యాద పూర్వకంగా కలసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వినతులతో కూడిన పత్రమును అందించారు. సమస్య తప్పకుండ రేపటినుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన హామీ ఇచ్చారు.