సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ బుధవారం సచివాలయంలో భేటీ అయింది. ఈ సమావేశంలో జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో కొత్త పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. UPSC సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన SC, ST, OBC, మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. దీనితో పాటు మొత్తం 49 అంశాలపై కేబినెట్‌లో చర్చ సాగింది.