గన్నవరం హనుమాన్ జంక్షన్ సీఐ కార్యాలయంలో ఇవాళ TDP నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విచారణకు హాజరై తన వివరణ ఇచ్చారు. గత నెలలో ‘యువగళం’ బహిరంగసభలో సీఎం జగన్పై అయ్యన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకున్న పోలీసులు.. 3 వారాల క్రితం అయ్యన్నను అదుపులోకి తీసుకుని జీపులో కొంతదూరం తీసుకెళ్లిన తర్వాత 41 CRPC నోటీసు ఇచ్చి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే.