కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టిన సందర్భంలో ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యాంగ ప్రతులను అందించింది. అయితే తమకు ఇచ్చిన రాజ్యాంగంలోని పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు మిస్ అయినట్లు కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. 1976లో రాజ్యాంగ సవరణ ద్వారా ఆ రెండు పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారన్నారు. అవి తాజా ప్రతుల్లో కనిపించకపోవడం ఆందోళనకరమన్నారు.