జివీఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ బుధవారం ఉదయం నగర పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అక్కయ్యపాలెం నుండి రైల్వే న్యూకాలనీ వరకు రోడ్డు విస్తరణ పనులను చేపడతామని చెప్పారు. ప్రాధాన్యతాక్రమాన్ని బట్టి నగర పరిధిలో అవసరమైన చోట్ల రహదారులను నిర్మిస్తామని కమిషనర్ చెప్పారు. ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నాలుగు రోడ్ల జంక్షన్ అభివృద్ధి పనులను తనిఖీ చేశారు.