కైకలూరు ఎమ్మెల్యే నుంచి తన భర్త మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సేవా నాగ జగన్ బాబురావుకు ప్రాణహాని ఉందని ఆయన సతీమణి ముదినేపల్లికి చెందిన మరియమ్మ మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పదే పదే తన భర్తను పోలీసు స్టేషనుకు పిలిపించి బెదిరిస్తున్నారని, దీంతో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని వాపోయారు. దీనిపై న్యాయపోరాటానికి అధికారులతో పాటు, వైసీపీ అధిష్టానంను సైతం కలుస్తానని ఆమె వివరించారు.