చంద్రయాన్-3 ప్రాజెక్ట్ లోని విక్రమ్ ల్యాండర్,ప్రగ్యాన్ రోవర్ ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్నాయి.మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ 22న చంద్రుని దక్షిణ ధ్రువంపై సూర్యోదయం కానుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి విక్రమ్ ల్యాండర్,ప్రగ్యాన్ రోవర్ పై నెలకొంది. దీంతో శాస్త్రవేత్తలు వాటిని తిరిగి నిద్ర నుంచి మేల్కొలిపేందకు ప్రయత్నిస్తామని చెబుతున్నారు. ఒక వేళ అనుకున్నట్లు జరిగితే భారత్ కు అదనపు ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది.