ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. మత్రివర్గం ఆమోదం తెలిపిన కీలక బిల్లులతోపాటు మరికొన్ని కొత్త బిల్లులపై సభల్లో చర్చించనున్నారు. స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అంశంపైనా సీఎం వైఎస్ జగన్ చర్చ చేపట్టనున్నట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకానున్నారు.