చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల చిన్నారిని ఓ నిందితుడు అత్యాచారం చేసి హత్య చేసిన దారుణ ఘటన మహారాష్ట్ర థానే జిల్లా భివాండీలో జరిగింది. ఈ నెల 13న నిందితుడు సలామత్ అలీ ఆలం అన్సారీ బాలికకు చాక్లెట్ ఇస్తానని నమ్మించి అత్యాచారం చేసి పాపను చంపేసి బకెట్ లో కుక్కి పరారయ్యాడు. బాలిక అదృశ్యంపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సినీ ఫక్కీలో నిందితున్ని తాజాగా అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
![]() |
![]() |