జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ 12 రోజులు నిర్విరామంగా విలువైన సమాచారాన్ని భూమికి పంపాయి. అక్కడి మైనస్ 180 డిగ్రీల్లో నిశ్చలంగా ఉండిపోయిన ల్యాండర్, రోవర్ ను శుక్రవారం చంద్రుడిపై పగలు వస్తున్న క్రమంలో మేల్కొలిపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. ఇది సక్సెస్ అయితే మరో అద్భుతమే అవుతుంది. మరో 14 రోజులు జాబిల్లి రహస్యాలు భూమిని చేరుతాయి.