అక్టోబర్ 23 అనగా విజయదశమి నుంచి విశాఖపట్నం నుంచే సీఎం జగన్ పాలన చేస్తారని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. కార్యాలయాల ఏర్పాట్ల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారని అమర్నాథ్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం ఏపీలో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది.. ఒకవేళ కేంద్రం ముందస్తుకు వెళితే రాష్ట్రం కూడా అనుసరించాల్సి ఉంటుంది.. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్ కుంభకోణాలను గత అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చించాం.. సభ్యుల సంఖ్యను బట్టే అసెంబ్లీలో సమయం కేటాయిస్తారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి ల్సిన అవసరం మాకు లేదు అని మంత్రి గుడివాడ అమర్నార్ అన్నారు.