చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. అసెంబ్లీలో మీసం తిప్పడంపై బాలకృష్ణకు స్పీకర్ తమ్మినేని సీతారాం వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ప్రవర్తనతో శాసనసభ గౌరవ సంప్రదాయాలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఇది మొదటి తప్పిదంగా భావించి క్షమిస్తున్నట్లు వెల్లడించారు.