టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. గురువారం బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సెప్టెంబర్ 26న మధ్యాహ్నం గం.2:15కి తిరిగి విచారిస్తామని తెలిపింది. ఈ కేసును హైబ్రిడ్ విధానంలో విచారించాలని పిటిషనర్లు కోరగా కోర్టు అంగీకరించింది. కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ నిందితుడిగా చేర్చడంపై చంద్రబాబు కోర్టును ఆశ్రయించారు.