హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏపీ విభజన చట్టం హామీలు ఉల్లంఘనపై జై ఆంధ్ర, జై తెలంగాణ ఉద్యమకారులు, మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా జై ఆంధ్ర ఉద్యమ నేత దేవరపల్లి మహేశ్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని, రెండు ప్రాంతాల ప్రజలను తప్పుదోవ పట్టించేలా, రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. రెండు ప్రాంతాల విభజన సాధన హామీల కోసం విజయవాడలో జరిగే సదస్సులో ఆంధ్ర, తెలంగాణ మేధావులతో కమిటీ ఏర్పాటు చేస్తామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం చెప్పారు.