టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అయితే ప్రతి పక్షం ఇచ్చిన వాయిదా తీర్మాణంను వేరే ఫార్మెట్లో వస్తే చర్చిస్తామన్నారు. ఈ విషయంపై తాము చర్చకు సిధ్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. అర్ధం పర్దం లేని వాయిదా తీర్మాణం ఇస్తున్నారని, దీనిపై చట్టపరంగా న్యాయ విచారణ జరుగుతోందన్నారు. అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బుగ్గన తెలియజేసారు. చంద్రబాబుపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు.