కావలి ఆర్టీసీ బస్టాండ్ ను ఆధునీకరించడానికి, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కావలి ఆర్టీసీ బస్టాండ్ ను, గ్యారేజీని ఆయన సందర్శించారు. కావలి డిపో మేనేజర్ ఆర్. శ్రీనివాసులు, సిబ్బంది, నాయకులు సాదరంగా ఆహ్వానించారు. బస్టాండ్ లో ఉన్నటువంటి డ్రైనేజీని మెరుగుపరుచుటకు తగిన చర్యలు తీసుకొవాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు.