టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కర్నూలు జిల్లా, ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, ఉమాపతినాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో పలువురు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మీనాక్షినాయుడు మాట్లాడుతూ..... రాక్షస పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలని ఆ భగవంతున్ని కోరుతున్నానన్నారు. టీడీపీని దెబ్బ కొట్టాలనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.