పాడి పశువులను పెంచే రైతుల్లో చాలా మంది పాల వ్యాపారానికి మాత్రమే పరిమితం అవుతుంటారు. అయితే, పెరుగు, వెన్న, నెయ్యి, క్రీమ్ వంటి వివిధ రకాల పాల ఉత్పత్తులను తయారు చేసి అమ్మగలిగితే అధికాదాయం పొందవచ్చు. అలాగే పేడతో గోబర్ గ్యాస్, వర్మీ కంపోస్టు వంటి వాటిని కూడా తయారు చేయవచ్చు. పాల శీతలీకరణ, పాల సేకరణ, దూడల పెంపకం చేపట్టవచ్చు.